Importance of Arafah Day
- Sirajuddin Mohammad
- Jul 19, 2021
- 1 min read

ధుల్-హిజ్జా యొక్క తొమ్మిదవ రోజు 'అరాఫా రోజు, హజ్ నెలలో ఈ రోజు వస్తుంది కాబట్టి ఈ రోజున హజ్ యత్రికులు' అరాఫా పర్వత మైదానం వద్ద గుమిగూడి అక్కడ దుఆ చేస్తారు ...
అరాఫా రోజు చాల ముఖ్యమైనది ఎందుకంటే ఈ అద్భుతమైన ఖురాన్ వాక్యం (అయా) ఈ రోజున అవతరించింది:
"ఈ రోజు నేను మీ కోసం మీ ధర్మాన్ని పరిపూర్ణంగా చేసాను మరియు మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేసాను మరియు మీ కోసం ఇస్లాంను మీ ధర్మంగా అంగీకరించాను." (సూరా అల్ మైదా 5:3)

అల్లాహ్ తన ధర్మాన్ని పరిపూర్ణంగా చేసి, తన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై తన అనుగ్రహాన్ని పూర్తి చేసి, ఇస్లాంను జీవన విధానంగా ఆమోదించిన రోజు అరాఫా రోజు!
ఉమర్ (రజి) ఇలా తెలిపారు, "అల్లాహ్! ఈ దివ్య వాక్కును తన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై శుక్రవారం, అరాఫా రోజున సాయంత్రం అవతరించారు."
ఈ రోజున ఉపవాసం ఉండడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై గారి సున్నత్, ఎవరైతే హజ్ యాత్రకు వెళ్లారో వారికీ ఈరోజు ఉపవాసం ఉండాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై సూచించారు. అరాఫా రోజున ఉపవాసం గురించి ప్రవక్త (స) ను అడిగినప్పుడు, అయన ఇలా అన్నారు: "ఇది గత సంవత్సరం చేసినవి మరియు రాబోయే సంవత్సరంలో చేసే పాపాలను తొలగిస్తుంది." (ముస్లిం)

Comments