Be upholders of justice న్యాయధ్వజవాహకులుగా నిలబడండి
- Sirajuddin Mohammad
- May 27, 2021
- 1 min read
అల్లాహ్ సుభానాహు తలా న్యాయాధిపతి, అల్లాహ్ పేర్లలో అల్-హకీమ్ కూడా ఒకటి, అల్లాహ్ తన దాసులను కూడా న్యాయ మార్గంలో నడవాలని, మరియు సాక్ష్యం ఇచ్చినప్పుడు తమ సాక్ష్యం సమర్థించుకుంటే సరిపోదు ఖచ్చితంగా ఎటువంటి మార్పులు లేకుండా న్యాయంగా ఇవ్వాలని ఆజ్ఞాపిస్తు విశ్వసులను ఉద్దేశించి చాల స్పష్టంగా ఖురాన్ 4:135 లో ఇలా చెబుతున్నారు
"విశ్వసించిన ప్రజలారా! న్యాయధ్వజవాహకులుగా నిలబడండి, అల్లాహ్ కొరకు సాక్షులుగా ఉండండి, మీ న్యాయం మీ సాక్ష్యం మీకు మీ తల్లిదండ్రులకూ, మీ బంధువులకూ ఎంతహాని కలిగించినా సరే."

సాధారణంగా ప్రజలు తమవరకు ఏమైనా అపనింద వస్తే మాట్లాడేటప్పుడు/ సాక్ష్యం ఇచ్చేటప్పుడు తమని తాము రక్షించుకునేందుకు వ్యవహారాన్ని తలా క్రిందులు మార్చేస్తారు, కానీ అల్లాహ్ విశ్వసులను నిజాన్ని న్యాయాన్ని నిర్భయంగా ఖచ్చితంగా చెప్పాలని ఆదేశిస్తున్నారు ఎంత ఖచ్చితంగా అంటే ఆ సాక్ష్యం ద్వారా ఆ వ్యక్తికీ లేదా అతని కుటుంబానికి హాని కలిగిన సరే న్యాయంపై ఉండాల్సినంత ఖచ్చితంగా, ఆ కారణంగానే అల్లాహ్ "మీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ" అని సెలవిచ్చారు.
ఇంకా అల్లాహ్ తలా అల్-హకీమ్ అన్నీ తెలిసిన వాడు కావున న్యాయాన్ని వక్రీకరించకండి అని హెచ్చరించారు
"మీరు గనక సాక్ష్యాన్ని వక్రీకరిస్తే, న్యాయాన్ని దాటవేస్తే, బాగాతెలుసుకోండి మీరు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు అని."
ఆలాహ్ ఆదేశానుసారం జీవితాన్ని గడిపే శక్తిని ప్రసాదించాలని అల్లాహ్ తో వేడుకుంటూ ... “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు”
コメント