Halal “హలాల్”
- Sirajuddin Mohammad
- May 27, 2021
- 1 min read
సంక్షిప్తంగా ధార్మిక పరిభాషలో ‘హలాల్’ అన్న అరబీ పదానికి అర్థం...
తినుటకు/వాడుటకు ‘శుద్ది (Purify) చేయబడిన’ లేక ‘పరిశుద్ధ పరచబడిన’ అని అర్థం. “హలాల్” చెయ్యటం అంటే- 1. హానికర పదార్థాలను తొలగించి..
2. తినటానికి/వాడుటకు యోగ్యమైనదిగా చేయటం అని అర్థం.
అల్లాహ్ ఖురాన్ లో ఇలా సెలవిచ్చారు :
విశ్వశించిన ప్రజలారా ! నిజంగానే మీరు అల్లాహ్ ఆరాధకులు అయితే, మేము మీకు ప్రసాదించిన పరిశుభ్రమైన వస్తువులను నిస్సంకోచంగా తినండి. (ఖురాన్ 2:172)

తినటానికి/వాడుటకు “యోగ్యమైన” లేదా “అనుమతి” ఉన్న (Permissible) వాటిని ‘హలాల్’ అని అంటారు. తినటానికి/వాడుటకు “యోగ్యంకాని” లేదా “అనుమతి లేని” (Forbidden) వాటిని ‘హరామ్’ అంటారు.
ఉదాహరణకు: ఆల్కహాల్, చచ్చిన జంతువు, పంది మాంసం, రక్తం వగైరా సేవించటానికి యోగ్యం కానివి ధార్మిక గ్రంథాల ప్రకారం ‘నిషేధింపబడ్డాయి’. అంటే ‘హరామ్ (Forbidden)’ అన్న మాట. వీటికి భిన్నంగా పరిశుభ్రమైన ‘తినటానికి యోగ్యమైన ఆహారం’ (Permissible food) ను ‘హలాల్’ అంటారు. అలాగే వ్యభిచారం “హరామ్ (నిషేధం)”.. పెళ్లి చేసుకోవటం “హలాల్ (ధర్మబద్ధం)”. అక్రమంగా సంపాదించటం “హరామ్ (నిషేధం)”.. సక్రమంగా సంపాదించటం “హలాల్ (ధర్మబద్ధం)” ఇలా చాలా విషయాల్లో ధర్మా-అధర్మాలను విశ్లేషించవచ్చు.
ధార్మిక పరిభాషలో జంతుమాంసాన్ని ‘హలాల్’ అనగా ...
సృష్టికర్త అయిన దేవుని స్మరణ చేస్తూ జంతు కంఠాన్ని, మెడ నాళము (Jugular Vein) ను కత్తిరించి పూర్తి రక్తాన్ని బయటకు తీయటం ద్వారా ‘శుద్ది (Purify)’ చేయబడిన దానిని ‘హాలాల్’ మాంసము అని అంటారు.
ధార్మిక పరిభాషలో హరమ్ చేసినవి ...
అల్లాహ్ నిషేదించినవి (హరమ్ చేసినవి) ఏమన్నా ఉంటే అవి ఇవి మాత్రమే : మరణించిన వాటిని తినకండి, రక్తాన్ని, పందిమాంసాన్ని ముట్టకండి, ఇంకా అల్లాహ్ కు కాక ఇతరులకు సమర్పించబడిన దానిని తినకండి. (ఖురాన్ 2:173)
Comments